మణికర్ణిక ఫోటోలు లీకైనాయి.... - MicTv.in - Telugu News
mictv telugu

మణికర్ణిక ఫోటోలు లీకైనాయి….

October 28, 2017

బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘ మణికర్ణిక ’. ఝాన్సీలక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది ఈ సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం జైపూర్‌లో ప్రత్యేకంగా  వేసిన సైట్‌‌లో  జరుగుతోంది.  

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు  సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. ఎలాంటి ఔట్‌పుట్ బయటకు రాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడినప్పటికి , కంగనాకు సంబంధించిన ఫోటోలు ఎలా బయటకు  వచ్చాయని అనేక ప్రశ్నలు వెల్లువడుతున్నాయి.

ఈ పోటోలను చూస్తుంటే ఈ చిత్రంలో కంగనా చాలా సింపుల్‌గా కనిపిస్తోంది. ఇప్పటికి సగం చిత్రీకరణ పూర్తి అయింది. మరో మూడు నెలల్లో  చిత్రీకరణను పూర్తి చేసుకొని, సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.