mictv telugu

స్కూల్‌లో బాంబు పెట్టిన దుండగులు

February 14, 2019

తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో వందల్లో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని కాంచీపూర్‌లో ఓ పాఠశాల వద్ద అనుమానాస్పద వస్తువును గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది మొదట పాఠశాల చిన్నారులతో పాటు చుట్టుపక్కల వారిని దూరంగా తీసుకెళ్లారు.తదనంతరం శక్తిమంతమైన ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు. తరువాత సదరు ఐఈడీ బాంబును పేల్చివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మణిపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇది ఉగ్రవాదుల పనే అయ్యుంటుందని భావిస్తున్నారు.