మణిరత్నం ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు... - MicTv.in - Telugu News
mictv telugu

మణిరత్నం ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు…

October 2, 2018

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తానని  ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘నవాబ్ ’ ఇటీవలే విడుదలై విజయవంతగా  ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలోని ఓ డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని వెంటనే తొలగించాలని ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.  లేకపోతే ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తానని తెలిపాడు. కానీ సినిమాలో ఏ డైలాగ్ అభ్యంతరకంగా ఉందో చెప్పలేదు.

Film director Mani Ratnam’s office in Chennai receives hoax  .. bomb threat call

ఆ ఆంగతకుడి బెదిరింపుతో , ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మణిరత్నం ఆఫీస్‌కు భద్రత కల్పించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలై, ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన నవాబ్ మంచి వసూళ్లను రాబడుతోంది.