mictv telugu

మాంజా వాడితే 5ఏళ్ల జైలు, లక్ష జరిమానా

January 11, 2019

సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడంలో అందరూ బిజీగా వుంటారు. ఆకాశంలో గాలిపటాలు పేంచ్ వేసి ఇతరుల పతంగుల దారాలను తెంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం స్ట్రాంగ్ దారం కావాలని మాంజాను ఎంచుకుంటారు. కానీ అది మంచిది కాదని చెప్తున్నా వినరు. అందుకే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

పతంగులు ఎగురవేయడానికి కాటన్‌తో తయారు చేసిన దారాలనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.Telugu news Manjha used a 5-year prison, a fine of Rs one lakhచైనా, నైలాన్‌, ప్లాస్టిక్‌ మాంజా అమ్మకాలు, ఉత్పత్తి, సరఫరాలపై నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పర్యాటక,  సాంస్కృతిక శాఖ సంచాలకులను, జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.