నాని హీరోగా మంజుల మూవీ - MicTv.in - Telugu News
mictv telugu

నాని హీరోగా మంజుల మూవీ

December 13, 2017

గతంలో తమ్ముడు మహేష్‌తో ‘నాని’ అనే సినిమాను నిర్మించిన నటి మంజుల ఇప్పుడు నేచురల్ స్టార్  నానీని హీరోగా పెట్టి సినిమా చెయ్యటానికి సిద్ధమైంది.  నటిగా, నిర్మాతగా తెలిసిన సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల ఇప్పుడు దర్శకురాలిగా కూడా ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. సందీప్ కిషన్ హీరోగా తన దర్శకత్వంలో ‘మనసుకు నచ్చింది ’ సినిమా చేస్తోంది. కాగా మంజుల తన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మరో సినిమా చేయటానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.మనసుకు నచ్చింది సినిమా పనుల్లో బిజీగా వుంటూనే ఈ చిత్ర కథను ఓకే చేసిందట మంజుల. ప్రస్తుతం విక్రమ్ అఖిల్ హీరోగా ‘హలో ’ సినిమా చేస్తున్నాడు. ఇటు మంజుల, అటు విక్రమ్‌లు తమ దర్శకత్వాల్లో వస్తున్న సినిమాలను ముగించుకొని ఈ సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం.