mictv telugu

మోదీ బయోపిక్‌లో అమిత్ షా ఇలా

February 13, 2019

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తున్నాడు. ఇందులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అమిత్ షా పాత్రలో మనోజ్ జోషి నటిస్తున్నారు.

Telugu News Manoj Joshi to play Amit Shah in PM Narendra Modi biopic.

షా పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఒమంగ్‌ కుమార్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈచిత్రాన్ని వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌-సందీప్‌ సింగ్‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘దేశభక్తే నా శక్తి’ అన్న ఉపశీర్షికతో ఈచిత్రం రూపొందుతోంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.Telugu News Manoj Joshi to play Amit Shah in PM Narendra Modi biopic