కిడారిని చంపిన మావోయిస్టు మీనా ఎన్‌కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

కిడారిని చంపిన మావోయిస్టు మీనా ఎన్‌కౌంటర్

October 12, 2018

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే   సివేరి సోమల హత్యలు  తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. వీరి హత్యలో పాల్గొన్న మావోయిస్ట్ మీనాను ఈరోజు ఎన్‌కౌంటర్లో చంపేశామని పోలీసులు చెప్పారు.  ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని బెజ్జంకి సమీపంలోని ఆండ్రపల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు.

కిడారి హత్యానంతరం  ఏపీ డీజీపీ విశాఖ మన్యంలో పర్యటించారు, తర్వాత ఒడిశా పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపాక కూంబింగ్ మొదలైంది. భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మావోలను అన్ని వైపులనుంచి చుట్టుముట్టాయి బలగాలు. ఈ క్రమంలో హోరాహోరి కాల్పులు చోటుచేసుకోవడంతో మీనా చనిపోయింది.

women moist Meena accused in TDP MLA Kidari shot dead in encounter in Andhra-Odisha boarder

ఎన్ కౌంటర్‌లో  గీత, జయంతి, రాజశేఖర్, రాధిక అనే మావోయిస్టులకు గాయాలయ్యాయి. వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన మీనా భర్త పేరు గాజర్ల రవి అలియాస్ గణేష్‌గా గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. మీనా మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త గణేష్ అలియాస్ గాజుల రవి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు.