ఎన్నికల భగ్నానికి భారీ కుట్ర.. భగ్నం

పోలింగ్ వేళ మావోయిస్టులు వేసిన మాస్టర్ ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు, పోలింగ్ సిబ్బందిని టార్గెట్ చేసి పైప్ బాంబులు అమర్చి బ్లాస్టింగ్ చేసేందుకు కుట్ర పన్నారు. వారి కుట్రను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ను పట్టుకున్నారు. వారిని రహస్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పెద్ద గండం  తప్పడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

Telugu news Maoists' conspiracy in the polling.. Police Offended

ఇదిలావుండగా తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల చిన్నపాటి ఘటనలతో పోలింగ్ ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు వరకు జరిగింది. తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి జనాలు బారులు తీరారు.

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడకుడలో సాయంత్రం ఐదు గంటల వరకు జనాలు పెద్ద ఎత్తునే బారులు తీరడం విశేషం. సమయం అయిపోయినా క్యూలైన్లలో వున్నవాళ్ళకు ఓటువేయడానికి అవకాశం ఇస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైందన్నది మీడియా సమావేశంలో సీఈవో రజత్‌‌కుమార్ తెలుపనున్నారు. 60%పైగా పోలింగ్ శాతం నమోదైందని తెలుస్తోంది. డిసెంబర్ 11 ఫలితాలు వెలువడనున్నాయి.

Telugu news Maoists’ conspiracy in the polling.. Police Offended