అంతిమక్షణాలు ఆనందంగా..  - MicTv.in - Telugu News
mictv telugu

అంతిమక్షణాలు ఆనందంగా.. 

October 27, 2017

అమెరికాలోని  కూక్ విల్లేలో పేషంట్ విషయంలో నర్స్ చూపిన ప్రేమ,  ఆత్మీయతతో అందరి మనస్సులను గెలచుకుంది. పేషంట్ కోరిక మేరకు  చనిపోయే చివరి క్షణాన ఆ  నర్స్  భావోద్వేగంత ఓ పాటను ఆలపించింది.  

మార్గరెట్ స్మిత్ అనే  పెద్దావిడ గత కొంతకాలంగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతోంది. గతవారం మార్గరెట్ తీవ్ర  ఆస్వస్థ చెందడంతో.. వండర్ బిల్డ్  యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి , చికిత్స అందించారు. అయితే రెండు  రోజుల్లోనే ఆమె చనిపోయింది.

మార్గరెట్కు సేవలు చేసిన  ఓలివియా న్యూఫెల్టర్ అనే నర్స్. ఆ బామ్మను  కన్న కుతూరిలాగా చూసుకుంది.  ఓలివియాను  మార్గరెట్ ముందుగా ‘ఏంజెల్’ అని పిలిచేంది.  కొన్ని  గంటల్లో తాను చనిపొతానని  భావించిన మార్గరెట్ … తన ‘ఏంజెల్’ ను తనకు ఇష్టమైన పాట పాడమని అడిగింది. ‘డ్యాన్సింగ్ ఇన్ ద స్కై’ అనే పాటను నర్స్  పాడుతుంటే మార్గరెట్ కూడా గొంతు కలిపింది. అదే సమయంలో మరో నర్స్ మార్గరెట్‌కు ఇంజక్షన్ ఇస్తున్నా ఏం బాధా  లెేదనన్నట్టుగా  కనిపించింది. తన తల్లి పాట వింటూ,  పాడుతూ చివరి క్షణాలను ఆస్వాదించిందని మార్గరెట్ కొడుకు మేగన్ పేర్కొన్నారు.  పెద్దావిడ కోసం ‘ఏంజెల్ నర్స్’ పాట పాడుతూ కన్నీళ్లు రాల్చడం  అందర్నీ కలచివేసింది.  ‘మేం  ఏం ఇచ్చిన మా అమ్మపై ‘ఏంజెల్’ చూపిన ప్రేమకు  సరితూగదు’ అని మేగన్ చెప్పాుడ. నర్స్ పాట ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.