మార్కెట్లోకి 160సీసీ ఎక్స్‌బ్లేడ్.. - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లోకి 160సీసీ ఎక్స్‌బ్లేడ్..

March 13, 2018

160సీసీ సామర్థ్యం కలిగిన ఎక్స్‌బ్లేడ్ మోడల్ హైఎండ్ బైకు దేశీయ మార్కెట్లోకి ఈరోజు విడుదల అయింది.  దీనిని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.78,500. యూనికార్న్, హార్నెట్, సీబీఆర్ తరహాలోనే అదే సామర్థ్యంతో ఎక్స్‌బ్లేడ్‌ను తీసుకొచ్చింది. దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన విక్రయ సంస్థ, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఈ కొత్త తరహా బైకును ముంబైలో ఆవిష్కరించింది.

ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, అలాయ్ వీల్స్, పూర్తి ఎల్ఈడీతో కూడిన హెడ్ ల్యాంప్, స్పోర్టీలుక్‌తో ఉండే ఫ్యుయల్ ట్యాంకు,  డిజిటల్ స్పీడియో మీటర్, అలాగే డ్యుయల్ అవుట్‌లెట్ మఫ్లర్ ఉన్నాయి. బైకు ఏ గేర్‌లో వున్నది డిస్‌ప్లేలో తెలుసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు వున్నఎక్స్‌బ్లేడ్ మోడల్ బైక్‌ల పంపిణీ ప్రారంభించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యదవీందర్ సింగ్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా హోండా డీలర్ల వద్ద రూ.5,000తో బుకింగ్  చేసుకోవచ్చని తెలిపారు.