రాత్రి పెళ్లి అయ్యింది..తెల్లారి పరీక్షకు హాజరైంది! - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రి పెళ్లి అయ్యింది..తెల్లారి పరీక్షకు హాజరైంది!

February 21, 2018

తెల్లారితే ఆమెకు ఇంటర్  సెకండియర్  బోర్డ్ ఎగ్జామ్. కానీ ఆరోజు రాత్రి కుటుంబసభ్యులు పెళ్లి ముహుర్తాన్ని నిశ్చయించారు. ఓవైపు చదివిన చదువుకు పరీక్ష, మరోవైపు  జీవితానికి పరీక్ష. ఈరెండింటిని ఆమె సమర్థవంతంగా పూర్తి చేసింది.

ఆగ్రాలో ఓ విద్యార్థి 12 వ తరగతి చదువుతోంది. పరీక్షకు  ముందురోజు రాత్రే కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి అయ్యింది. కాళ్ల పారాణి ఆరకముందే మరుసటి రోజే ఆమె పరీక్షకు హాజరయ్యింది. చదువు పట్ల ఆ యువతికి ఉన్న ఆసక్తిని అందరూ అభినందిస్తున్నారు.