రైలులో పెళ్లి.. పెళ్లి పెద్ద ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

రైలులో పెళ్లి.. పెళ్లి పెద్ద ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ !

March 1, 2018

మండపంలో పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఏముంది అని అనుకున్నారు. అందుకే కదులుతున్న రైలే వాళ్ల పెళ్లికి  మండపం అయ్యింది.   కదులుతున్న రైలులోనే బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ కుమార్, జోత్న సింగ్ పటేల్ అనే అమ్మాయికి పెళ్లి నిశ్చమైంది.

అయితే  ఫంక్షన్ హాళ్లలో పెళ్లి మండపంలో పెళ్లి చేసుకుంటే రొటీన్‌గా ఉంటుంది. అందుకే రైలులో పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. రైల్వే అధికారుల పర్మిషన్ తీసుకుని పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. రైలులో  పెళ్లి జరుగుతుంటే అదే సమయానికి అదే రైళ్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్నారు. రవిశంకర్ పెళ్లి పెద్ద కాగ వరుడు  వధువు మెడలో తాళి కట్టాడు.  రవిశంకర్  దంపతులను ఆశీర్వదించారు.