వేలు లేదని పెళ్లి చేసుకోనంది.. పోలీసుల వచ్చి.. - MicTv.in - Telugu News
mictv telugu

వేలు లేదని పెళ్లి చేసుకోనంది.. పోలీసుల వచ్చి..

March 15, 2018

వరుడి కుడిచేయికి ఒక వేలు లేదని  వధువు మెండికేసి తనకు ఈ పెళ్లి వద్దని వాదించింది ఓ వధువు.  ఈ ఘటన జార్ఖండ్‌లోని బడ్బిల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పెళ్లికి ముందు  తంతులో వరుడు, వధువు నుదుటన సింధూరం పెట్టబోయేముందు వధువు దృష్టి వరుడి కుడిచేయిపై పడింది. ఆ చేయికి ఒక వేలు లేదు. దాంతో ఆమె  ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి ,పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కుష్టు వ్యాధి వల్ల అతని చేతి వేలు పోయుంటుందని వధువు భావించిందట. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు మూడు గంటలపాటు గొడవ జరిగింది. రాత్రంతా  కళ్యాణమండపంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు ఉదయం సమాచారం అందగానే రంగప్రవేశం చేశారు. పెళ్లి కూతురుకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి కుమారుడు మాట్లాడుతూ… ‘ఒక ప్రమాదంలో నా చేతి వేలు తెగిపోయింది. నాకు ఎలాంటి వ్యాధి లేదు. నమ్మండి మొర్రో..’ చెప్పడంతో అందరూ చల్లబడ్డారు.