ఓరే జగ్గూ.. ఆమె ఉసురు పోసుకున్నావు కదరా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓరే జగ్గూ.. ఆమె ఉసురు పోసుకున్నావు కదరా..

September 28, 2018

ప్రేమలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. బలవన్మరణాలకు దారితీస్తున్నాయి. ప్రేమపేరుతో కొందరు యువకులు నయవంచనకు పాల్పడుతున్నారు. కలసి తిరిగినన్నాళ్ళూ తిరిగి తర్వాత నువ్వెవెరో నాకు తెలియదుపో, నువ్వెంతమందితో తిరిగావో అని కారుకూతలు కూస్తున్నారు. దీంతో బాధితులు నిరాశానిస్పృహలకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్‌లో ఒక అమ్మాయి ప్రేమ తిరస్కరణకు బలైంది. ప్రాణానికంటే మిన్నగా ప్రేమించిన ప్రియుడు.. పెళ్లికి నిరాకరించడంతో ఉసురు తీసుకుంది.

కానాజీగూడుకు చెందిన అనిత(17), జగ్గు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జగ్గు అల్వాల్‌లో బేకరీ నడుపుతున్నాడు. అనితను పెళ్లి చేసుకుంటానని ప్రేమలో పడేసి ఆమెతో చట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఆమె పెళ్లిమాట ఎత్తేసరికి మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని మనస్తాపం చెందిన అనిత ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఆల్వాల్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిత మృతికి కారణమైన జగ్గును వెంటనే అరెస్టు శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.