mictv telugu

ఢిల్లీలో ఘోరం.. అగ్నిప్రమాదంలో 100 గుడిసెలు దగ్ధం

January 11, 2019

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు వంద పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఓ ఫర్నీచర్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. దీంతో పేదలకు చెందిన 100 ఇళ్ళు దగ్ధమయ్యాయి.Telugu News Massive Fire At Delhi Furniture Market, Nearly 100 Shanties Destroyedదీంతో అక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. ఫర్నీచర్‌ దుకాణంలో భారీగా మంటలు అంటుకోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దుకాణం నాలుగో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 అగ్నిమాపక యంత్రాలతో శుక్రవారం ఉదయానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.