mictv telugu

కుంభమేళాలో అగ్నిప్రమాదం..

January 14, 2019

మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మహా కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (అలహాబాద్)లో జరగనున్న ఈ కుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగింది. కుంభమేళా ప్రదేశంలో దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. మరికొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కాగా, ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరిగే ఈ మహా వేడుకకు  12 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Telugu news Massive fire at Kumbh Mela 2019 triggered by cylinder blast, several tents gutted - PICS and VIDEO