ఏంసీఎలోనూ  తెలంగాణ పోరిలెక్కే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏంసీఎలోనూ  తెలంగాణ పోరిలెక్కే..

December 8, 2017

‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలంగాణ యాసతో దుమ్మురేపి అందరినీ ఆకట్టుకుంది పోరి.  తెలుగులో తొలి సినిమాలోనే తనకు తానే  డబ్బింగ్ చెప్పుకుని  శభాశ్ అనిపించుకుంది. ఆ ఒక్క సినిమాతో పల్లవి ఓ పది సినిమాలకు విజయం సాధించినంత కరిజ్మాను సొంతం చేసుకుంది.సాయిపల్లవి.. నేచురల్ స్టార్ నానితో కలసి  నటిస్తున్న తాజా మూవీ  ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’(ఎంసీఏ).. ఇందులోనూ ఆమె తెలంగాణ అమ్మాయిగానే కనిపించనుంది. ఈ చిత్రం వరంగల్ నేపథ్యంలో కొనసాగుతుంది. హీరో , హీరోయిన్ ఇద్దరూ తెలంగాణ వారిలాగే  కనిపించనున్నారు. అయితే  ఒకే తరహా పాత్ర అనిపించకూడదన్న ఉద్దేశంతో  పల్లవి.. పక్కా  తెలంగాణ యాస మాట్లాడదని, భాషలో కొంత పాలిష్ ఉంటుందని సమాచారం. ఈ మూవీకి కూడా ఆమె తానే డబ్బింగ్ చెప్పుకుంది.  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.