కాసేపట్లో మక్కా మసీదు పేలుళ్ళ ఎన్ఐఏ కోర్టు తీర్పు.. పాతబస్తీలో బందోబస్తు - MicTv.in - Telugu News
mictv telugu

కాసేపట్లో మక్కా మసీదు పేలుళ్ళ ఎన్ఐఏ కోర్టు తీర్పు.. పాతబస్తీలో బందోబస్తు

April 16, 2018

11 ఏళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం మక్కామసీదు పేలుళ్ల కేసులో మరికాసేపట్లో తుది తీర్పు రానుంది. నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నుంచి తీర్పు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కోర్టు, పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో పాతబస్తీ చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది. మక్కా మసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో 9మంది మరణించగా, 58 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. సమీపంలోనే పేలని మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఒక వర్గం ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మరోవర్గం పేలుళ్లకు పాల్పడుతోందనే కారణంతో మక్కామసీదు పేలుడు ఘటనకు పాల్పడినట్లు వెల్లడైంది. అయితే ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్‌ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

ఘటన జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో సుమారు 5వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఘటన తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సీబీఐ తొలుత ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేసింది. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రగుప్తా అలియాస్‌ బాబీ, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌ శర్మ అలియాస్‌ అజయ్‌ తివారి, నాబకుమార్‌ సర్కార్‌ అలియాస్‌ అసీమానంద  నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గుజరాత్‌లోని డాంగ్‌ ప్రాంతానికి చెందిన అసీమానంద హరిద్వార్‌ అత్మాల్‌పూర్‌లోని పరమహంస ఆశ్రమంలో తలదాచుకున్నట్లు గుర్తించి 2010లో అరెస్ట్‌ చేశారు. 2011లో మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌‌ను అరెస్ట్ చేశారు. 2013లో గుజరాత్‌ వల్సాద్‌కు చెందిన భారత్‌ మోహన్‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌భాయి  పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలో ప్రమేయం వున్న మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన సందీప్‌ వి డాంగే అలియాస్‌ వాసుదేవ్‌, రామచంద్ర కల్సంగ్రా రాంజీ అలియాస్‌ ఓమ్‌జీ మాత్రం ఇంకా దొరకలేదు. మధ్యప్రదేశ్‌ దేవాస్‌కు చెందిన మరో నిందితుడు సునీల్‌జోషి పేలుడు జరిగిన ఏడాదే హత్యకు గురయ్యాడు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్‌ పార్మార్‌, అమిత్‌చౌహన్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది. ఇవాళ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో హైదరాబాదు పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించి వున్నాయి.