మెదక్ రికార్డు.. అత్యధికంగా 75 శాతం పోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

మెదక్ రికార్డు.. అత్యధికంగా 75 శాతం పోలింగ్

December 7, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 4 గంటలకు దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ నియోజకవర్గంలో అత్యధికంగా 76 శాతం నమోదైంది. తుంగతుర్తిలో 73 శాతం, అలంపూర్లో 71 శాంతం రికార్డయింది. హైదారాబాద్ నియోజకవర్గాల్లో సగటున 35 శాతం వరకు వచ్చింది. కొన్నిచోట్ల అయితే 30 శాతం కూడా దాటలేదు.

Telugu news medak scores record with 75 percent polling in Telangana assembly elections

ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకుంది. కొన్నిచోట్ల మధ్యాహ్నానికి బాగా తగ్గిపోయింది. చాంద్రాయణ గుట్టలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి. యాకుత్ పురాలోనూ భారీ సంఖ్యలో ఓట్లు మాయమయ్యాయి. కొన్నిచోట్ల రిగ్గింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. కొందరు ఓట్లు గల్లంతు కావడంతో తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లారు.