ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర ముగిసింది. ఈసారి కోటీ ఇరవై ఐదు లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క, సారక్కలను దర్శించుకున్నారు. అయితే ఆలయ అధికారులు హుండీల లెక్కింపును చేపట్టారు. 350 మంది సిబ్బందితో 202 హుండీలను లెక్కించారు.
లెక్కింపు పూర్తయిన తర్వాత హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు మీడియాకు తెలిపారు. 202 హుండీలలో మొత్తం 4 కోట్ల 87 లక్షల 40 వేల రూపాయలను భక్తులు అమ్మవార్లకు సమర్పించినట్లు ఆయన తెలిపారు.