మామను చంపిన అల్లుడు... - MicTv.in - Telugu News
mictv telugu

మామను చంపిన అల్లుడు…

April 13, 2018

అల్లుడు  తాగిన మైకంలో మామను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట  గాజులరామారం గురునానక్ బస్తీలో చోటు చేసుకుంది. బస్తీలో నివాసముండే జర్నాల్ సింగ్(38) తన భార్య ఈశ్వరికౌర్‌తో గురువారం  సాయత్రం గొడవ పడుతున్న సమయంలో ఈశ్వరికౌర్ తండ్రి జీవన్ సింగ్ (65) అడ్డుకున్నాడు. అప్పటికే జర్నాల్ తాగిన మైకంలో ఉండడంతో  అడ్డొచ్చిన మామను కత్తితో పొడిచాడు.చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.మృతుడు జీవన్‌సింగ్‌తో పాటు గొడవను అడ్డుకునేందుకు వెళ్ళిన బావమరిది అజుసింగ్, స్థానికుడు కిరణ్‌సింగ్‌లకు గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హంతకుడు జర్నాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు.