‘హెచ్ఐవి’ కి మందు    - MicTv.in - Telugu News
mictv telugu

‘హెచ్ఐవి’ కి మందు   

October 30, 2017

హెచ్‌ఐవీ వ్యాధికి ఇప్పటివరకైతే  కేవలం చికిత్సమాత్రమే ఉంది, కానీ పూర్తిగా నయం చేయడానికి మందు మాత్రం లేదు. ఈ వైరస్  శరీరంలో ప్రవేశించిన తరువాత ఒక రూపంలో ఉండదు, తన రూపాన్ని మార్చుకుంటుంది. దాంతో శాస్త్రవేత్తలు దాని రూపుమాపడానికి ప్రయత్నించిన విజయం సాధించలేకపోయారు.

 కానీ  అమెరికాలోని మేరిలాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీని గురించి కీలక విషయాన్ని కనుగొన్నారు. హెచ్‌ఐవీ చుట్టూ రక్షణ పొరను చేధించేందుకు, ఓ ప్రొటీన్ కనుగొన్నారు.హెచ్‌ఐవీ వైరస్ సాధారణంగా వివిధ రూపాల్లోకి మారినప్పుడు దాన్ని పొరల్లో ఉన్న ప్రోటీన్లు కూడా మారుతుంటాయి.   మెుత్తం 60 రకాల ప్రోటీన్లుగా మారుతుందని గుర్తించారు.  హెచ్ఐవీ వైరస్ వివిధ రూపాల ప్రోటీన్లను పరిశీలించినప్పడు, జీపి-120 అనే ప్రోటీన్  అన్ని  ప్రోటీన్లలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు . దీంతో జీపి-120ని గుర్తించి నాశనం చేసే ఔషదం తయారు చేశారు. దానిని  మెుదటగా కుందేళ్ల మీద ప్రయోగించగా ఫలితం కనిపించింది. దాంతో పూర్తిస్థాయిలో ప్రయోగాలకు సిద్దమవుతున్నారు శాస్త్రవేత్తలు.