అన్నపూర్ణ స్టూడియోలో సమావేశం.. మీడియాను అనుమతించలేదు - MicTv.in - Telugu News
mictv telugu

అన్నపూర్ణ స్టూడియోలో సమావేశం.. మీడియాను అనుమతించలేదు

April 21, 2018

భద్రతా కారణాల రీత్యా పవన్ కల్యాణ్ అన్నపూర్ణ స్టూడియోలో సమావేశానికి రాకపోయినప్పటికీ సమావేశం జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్‌పై, ఇతర టాలీవుడ్ సమస్యలపై చర్చించే నిమిత్తం 24 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.కాగా మీడియాను సమావేశానికి అనుమతించకపోవటం గమనార్హం. బయట మీడియాతో మాట్లాడకుండానే సినీ పెద్దలు వెళ్ళిపోయారు. త్వరలోనే 24 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అవుతారని, ఈ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటింటే అవకాశం వుందని తెలుస్తోంది.