కులాలను కించపరుస్తావా బాలయ్యా: నాగబాబు - MicTv.in - Telugu News
mictv telugu

కులాలను కించపరుస్తావా బాలయ్యా: నాగబాబు

January 8, 2019

మెగా బ్రదర్ నాగబాబు.. నందమూరి లెజెండ్ బాలకృష్ణకు కౌంటర్లపై కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో జనసేనపై, మరి కొన్నిపార్టీలపై  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ఇన్నాళ్లు వీటి గురించి అంతగా పట్టించుకోని  నాగబాబు కొద్ది రోజుల నుండి వరుసగా లజెండ్‌పై విరుచుకు పడుతున్నారు. పదిరోజుల కింద బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదని అన్నారు. తెలుగు సినిమా హీరో కదా అని అడిగితే అవునా, నాకు  తెలియదని చెప్పారు. బాలకృష్ణ గతంలో సంకర జాతి పార్టీలని, పింజారీ, మార్వాడీ, అలగా, బలగా అని కొన్ని కులాల పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను వెలికి తీసి వాటిపై స్పందించారు.

స్టార్లు, రాజకీయ నాయకులు  మీరు మాత్రమే కాదు, చాలా ఉంది న్నారని అంటున్నారు నాగబాబు. అంతేకాదు తమ కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ పార్టీ గురించి లెజెండ్ కామెంట్లు చేశారు కాబ్టటే తాను స్పందించాల్సి వస్తుందని అన అంటూనే ఇంకొన్ని విషయాలపై స్పందిస్తానని అన్నారు.  ఇప్పటికే కొన్ని విషయాలపై స్పందించానని, రేపోమాపో మిగతా వాటి గురించి మాట్లాడతానని అంటున్నారు.

‘అన్ని కులాల వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.  తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు. అహంకారంతో మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాకీయంగానే చూసుకోవాలి. అంతే కానీ ఇలా తక్కువ చేసిన మాట్లాడటం సరి కాదు..’ అని అన్నారు. అయితే అతని విమర్శలపై నందమూరి ఫ్యామిలీ నుండి ఎవ్వరూ స్పందించడం లేదు. ఇది సరైన సమయం కాదని బాలయ్య అన్నారు.

నాగబాబే ప్రతినిధి.  

తమ ఫ్యామిలీ గురించి ఎవరెమీ మాట్లాడినా ఊరుకునేది లేదంటున్న నాగేంద్రబాబు దూకుడు మరింత పెంచారు.  ఈ మధ్య కాలంలో తమ ఫ్యామిలీ గురించి మాట్లాడిన అందరికీ నాగబాబే కౌంటర్లు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. గతంలోరాంగోపాల్ వర్మ పై కూడా స్పందించారు.  మెగా ఫ్యామిలీ సిన్మాల గురించి, వారి రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా సహించేది లేదంటున్న పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఆయన కుమారుడు కోటి రూపాయలిస్తు, నాగబాబు ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చారు. తమ  ఫ్యామిలీ మెంబర్ పార్టీకి తాము ఎలా సపోర్టు చేసుకుంటామో కూడా చెప్పారు. ఇన్నాళ్లు ఎవ్వరి గురించీ అంతగా  పట్టించుకోని నాగబాబు, ఇలా వీధికెక్కడం చిత్రంగా ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. Telugu news mega family member nagabau counters to balakrishana on later comments on caste and politics