మెగా అల్లుడి సినిమా షురూ.. రాజమౌళి దర్శకత్వం.. - MicTv.in - Telugu News
mictv telugu

మెగా అల్లుడి సినిమా షురూ.. రాజమౌళి దర్శకత్వం..

January 31, 2018

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అల్లుడు హీరోగా పరిచయమవుతున్న సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది. కల్యాణ్ దేవ్ సినిమాకు మామ చిరంజీవి కొబ్బరికాయ కొట్టి, ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం చిరంజీవి క్లాప్‌ కొట్టారు.తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ కళ్యాణ వైభోగమే ’ సినిమా ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నది.

అల్లుడికి నటన మీద వున్న ఇష్టాన్ని గమనించిన చిరంజీవి  తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. మెగా కుటుంబం నుండి పరిచయమవుతున్న 10వ హీరో కల్యాణ్ అవటం విశేషం. మెగా కుటుంబం నుండి తమ్ముళ్ళు, కొడుకులు, కూతురు వచ్చారు. ఇప్పుడు అల్లుడు హీరోగా పరిచయం అవడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.