సరిహద్దులో పూరీ కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులో పూరీ కొడుకు

February 9, 2018

తండ్రి దర్శకత్వం – తనయుడు హీరో అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే లేటెస్ట్ సినిమా                ‘ మెహెబూబా’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆయన కొడుకు ఆకాశ్ పూరీ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.  ఈ చిత్రం టీజర్‌ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. 1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది ఈ మూవీ. బెంగుళూరుకు చెందిన నేహాశెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
టీజర్‌లో భారత్-పాక్ సరిహద్దు గేట్ తెరవటం.. యుద్ధ వాతావరంణలో సైనికుడి గెటప్‌లో వున్న ఆకాశ్, నేహాశెట్టి చేయి పట్టుకొని పరుగెత్తడం ఆకట్టుకుంటోంది. ‘ మెహబూబా ’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. పాకిస్తాన్ అమ్మాయికి – భారత్ అబ్బాయికి మధ్య ప్రేమకథా చిత్రం కావచ్చని అప్పుడే చాలా మంది అంచనాలకు వచ్చేస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవొచ్చంటున్నారు చిత్ర యూనిట్. 2015 లో ‘ ఆంధ్రాపోరీ ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు ఆకాశ్. ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కొడుకును హీరోగా పటిష్టంగా నిలబెట్టాలని తండ్రి పూరీ జగన్నాథ్ గట్టిగా అనుకొని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ వేసవిలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.