షాపింగ్ చెయ్యడంలో మగవాళ్లే టాప్..!

షాపింగ్ చెయ్యడంలో ఆడోళ్లను మించినోళ్లు లేరని అని అంటారు. కానీ ఆడోళ్లనే మించిపోయారు మగవాళ్లు. ఈ ఏడాదిలో చేసిన సర్వేలో ఆన్ లైన్ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యం అని తేలింది. ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లలో మగవాళ్లు 65 శాతం మంది ఉంటే, ఆడవాళ్లు 35 శాతం మందే ఉన్నారట. ఇక పండగ సీజన్‌లో 25 నుంచి 34 మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుపుతున్నట్లు తేలింది. మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు తదితరాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ప్రస్తుత పండగ సీజన్‌లో సుమారు రూ.30వేల కోట్లను ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు వెచ్చించ‌నున్నారని అంచనా. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగడానికి అందరికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఈ- కామర్స్‌ ఇండస్ట్రీకి వూతమిచ్చిందని అన్నారు.

SHARE