తెలుగు ‘మెర్సల్’ విడుదలలో జాప్యం - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు ‘మెర్సల్’ విడుదలలో జాప్యం

October 24, 2017

వివాదాస్పదంగా మారిన తమిళ మూవీ ‘మెర్సల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నెల 18నే తమిళ వెర్షన్ తోపాటు తెలుగులో కూడా ఇది వెండితెరపైకి రావాల్సి ఉండింది. అయితే సెన్సార్ పూర్తి కాకపోవడంతో 26కు వాయిదా వేశారు. ఇప్పుడు వివాదాల నేపథ్యంలో ఆ రోజున కూడా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.  విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు ఉన్నాయని, దీన్ని నిలిపి వేయాలనే  హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

 

ఇదిలా వుండగా ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను తెలుగు నిర్మాతలు కొనుక్కున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విజయ్ నటించిన తమిళ ‘పులి ’ సినిమా హక్కుల కోసం చిరంజీవి, రాజశేఖర్ పోటీ పడ్డారు. చివరికి చిరంజీవియే కొనేసి ‘ ఖైదీ నెంబర్ 150 ’ సినిమాగా రీమేక్ చేశారు. అలా విడుదలకు సిద్ధంగా వున్న పులి సినిమాను విడుదల కాకుండా ఆపారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా అలాగే ఎవరో కొనేసి వుంటారనే అనుమానం వ్యక్తం అవుతున్నది.