నన్ను డబ్బింగ్ యూనియన్‌లోంచి ఎలా తీసేస్తారు ? ‘99’ నా ఆఖరి చిత్రం… చిన్మయి - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను డబ్బింగ్ యూనియన్‌లోంచి ఎలా తీసేస్తారు ? ‘99’ నా ఆఖరి చిత్రం… చిన్మయి

November 18, 2018

తమిళ రంగంలో పెద్ద మనిషిగా, ప్రముఖ రచయితగా పేరుపొందిన రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన మీటూ ఆరోపణలు ఎంత సంచలనంగా మారాయో తెల్సిన విషయమే. తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా సహా ఇంకా చాలామంది తనను లైంగికంగా వేధించారని చిన్మయి ఆరోపించింది. చిన్మయిని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి కొందరు కామాంధుల పేర్లు బయటపెడుతున్నారు.

https://twitter.com/Chinmayi/status/1063836917169500160 

అయితే ఇప్పుడు ఈ ‘మీటూ’ ఉద్యమం చిన్మయికి కొత్త సమస్యలను తెచ్చి పెడుతోంది. తాజాగా ఆమె తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన వారికి మద్దతిచ్చిన పాపానికి, తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని చిన్మయి ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాక ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్‌ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా తన సభ్యత్వాన్ని ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఇలా చేస్తారని తనకు ముందే తెలుసునని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమిళ డబ్బింగ్ యూనియన్‌పై ఇప్పటికే 15కు పైగా కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నాననీ, ఇలాంటప్పుడు రాతపూర్వకంగా వివరణ ఎలా ఇవ్వగలనని ప్రశ్నించింది. తాను అమెరికాలో ఉన్నందున ఇంకా నోటీసు అందుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై పరిశోధనాత్మక విచారణ జరపాలని వికటన్ పత్రికను కోరింది.

తనపై వేటు ఇలాగే కొనసాగితే, తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ హీరోయిన్‌ త్రిషకు చెప్పిన డబ్బింగ్‌ తన చివరి చిత్రం అవుతుందని ఆమె ట్వీట్‌‌లో తెలిపారు. చిన్మయి వరుస ట్వీట్లపై కొందరు సమర్థిస్తున్నారు… మరికొందరు విమర్శిస్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్నవారికి చిన్మయి ట్విట్టర్‌లోనే సమాధానం చెబుతోంది.

Telugu news MeToo campaigner Chinmayi terminated from Tamil Nadu dubbing union, singer says ’96’ might be last project…