నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు రయ్ రయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు రయ్ రయ్..

November 25, 2017

హైదరాబాదు నగరవాసుల మెట్రో కల మూడురోజుల్లో సాకారం కానుంది.  ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, తలసాని, పద్మారావు, మేయర్ రామ్మోహన్, కమీషనర్ మహేందర్ రెడ్డి శనివారం మెట్రో ట్రయల్ రన్ లో ప్రయాణంచారు. రన్  నాగోల్ నుండి మెట్టుగూడా వరకు విజయవంతంగా సాగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ మెట్రో రైలు ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  జంట నగరాలకు మెట్రో రైలు సర్వీసులు మణిహారం లాంటివి. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు.. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో అందుబాటులోకి వస్తుంది. మూడు నెలల వరకు రాత్రి 10 గంటల వరకే మెట్రో సేవలు ఉంటాయి. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి ‘ అని తెలిపారు.

ప్రస్తుతం మెట్రోలో 57 రైళ్లు వున్నాయని, ప్రతి రైలుకు మొత్తం మూడు కోచ్‌లలో వెయ్యి మంది చొప్పున ప్రయాణించవచ్చన్నారు. రెండు రోజుల్లో టికెట్ల గురించి ప్రకటిస్తారని, సామాన్యుడికి అందుబాటులో వుండేలా టికెట్‌ ధరలు ఉంటాయని తెలిపారు. 24 స్టేషన్లకు అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సాయంతో మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్ళను ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. మెట్రో రెండో దశకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.