మైక్‌టీవీ బతుకమ్మ పూర్తి పాట.. పండుగకు 2రోజులు ముందే.. ఆడుకోండ్రి.. పాడుకోండ్రి.. - MicTv.in - Telugu News
mictv telugu

మైక్‌టీవీ బతుకమ్మ పూర్తి పాట.. పండుగకు 2రోజులు ముందే.. ఆడుకోండ్రి.. పాడుకోండ్రి..

October 7, 2018

మైక్ టీవీ బతుకమ్మ పండుగ మొత్తం పాటను రెండు రోజులు ముందుగానే అందిస్తున్నాం… అమ్మలక్కలంతా కలిసి ఆడుకోండ్రి… పాడుకోండ్రి…

ప్రేక్షకులకు నచ్చే పాటలు అందించడంలో మైక్ టీవీ ఎప్పుడూ ముందుండింది. తెలంగాణ అవతరణ దినోత్సవం పాటతో మొదలైన మైక్ పాటలు వరుస హిట్లుగా నిలిచాయి. వివిధ పండగ సందర్భాలలో మైక్ టీవీ అందించిన పాటలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలంగాణ పండుగల్లో మకుటమైన పండగ బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండగకు ప్రేక్షకులు మైక్ టీవీ నుంచి పాటను కోరుకుంటున్నారు. ప్రేక్షకులకు అదే ఊపు, అదే లాలింపు, అదే మట్టివాసనను, అదే తీరొక్క పూల సుగంధాన్ని అందిస్తూ తాజాగా మైక్ టీవీ మరో పాటను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటివరకు వచ్చిన పాటలను ప్రేక్షకులు గుండెలకు హత్తుకున్నారు. ఆదరించారు… అక్కున చేర్చుకున్నారు. తాజాగా మైక్ టీవీ మరో బతుకమ్మ పూర్తి పాటతో మీ ముందుకు వచ్చింది.

 

‘కురిసే వానలతో వాగులన్ని పారినయీ

సిరుల చెరువులతో బావులన్ని నిండినయీ

పల్లె కరువుదీర పంటలతో మురిసినదీ

ఎదలో ప్రేమలన్ని పువ్వులలో పేర్చినదీ..’

అంటూ డా. నందినీ సిధారెడ్డి సర్ కలం నుంచి జాలువారిన పదాలు మంగ్లీ గొంతునుంచి పరవశించాయి.

బతుకమ్మ పండుగ ఉత్సవాన్ని కళ్ళముందు సాక్షాత్కరించింది. మంత్రి కల్వకుంట్ల కవిత కనిపించి ఈ పాటకు మరింత వన్నె తెచ్చారు.  

Director - Damu Reddy 
Lirisist - Dr. Nandini siddareddy
Music - Suresh Bobbili
Singer - Mangli
DOP - Thirupati
Editing - Uday Kumbham
GFX - Aretty Mittu
Production - Shiva Prasad Balla
Excution - Sathish Manjeera
Co-Ordinator - Anji, Satish dama
Dress courtesy - Swapna paidi
Special thanks - Appi Reddy

క్రింది లింకులో మీరు పూర్తి పాటను చూడవచ్చు….