మైక్ టీవి బతుకమ్మ ప్రోమోకు కవిత ప్రశంసలు ! - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవి బతుకమ్మ ప్రోమోకు కవిత ప్రశంసలు !

September 14, 2017

నిన్నగాక మొన్న రిలీజైన ‘ మైక్ టీవి ’ బతుకమ్మ పాట ప్రోమోకు ఎక్కడ చూసినా భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఈ ప్రోమోను షేర్ చేసారు. ‘ మైక్ టీవి వారి బ్యూటిఫుల్ బతుకమ్మ పాట ’ అని ప్రోమోను అభినందిస్తూ షేర్ చేసారు. తెలంగాణాలోని అందమైన లొకేషన్లలో అత్యంత ఆహ్లాదంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ పాట ప్రోమో కవితక్కను విశేషంగా ఆకట్టుకున్నది. మైక్ టీవి ఎప్పటికప్పుడు కొత్తదనానికి పెద్ద పీట వేస్తూ ముందుకు వెళుతోంది. ఆ పరంపరంలోనే బతుకమ్మ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో కూడా రెండవ స్థానాన్ని కైవసం చేస్కున్నది. ఈ బూస్టుతో త్వరలో పూర్తి సాంగ్ తో కనువిందుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది మైక్ టీవి.