వచ్చేస్తోంది మీ మైక్ టీవీ దీపావళి పాట.. - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చేస్తోంది మీ మైక్ టీవీ దీపావళి పాట..

November 6, 2018

చీకటిని చెదరగొట్టి ఇంటిని వెలిగిస్తుంది దీపం. అలసిన మనసును ఊరడిస్తుంది సంగీతం. దేహంలో ఉత్సాహాన్ని నింపుతుంది నృత్యం.. దీపం, సంగీతం, నృత్యం.. ఈ మూడింటి మేలు కలయికతో మరో అద్భుత దృశ్యాకావ్యాన్ని ఆవిష్కరించింది మీ అభిమాన మైక్ టీవీ. ఈ దీపావళిని మరింత కాంతిమంతం చేసే పాటను మరికాసేపట్లో మీ ముందుంచనుంది.

Diwali Mictv

‘’ఊరూవాడా ఉత్సాహంగా వెలుగులు చిమ్మేలే

చుట్టాలంతా ఆనందంగా సందడి చేసేలే

జోరుగ పండగ జేద్దాం దీపాల కాంతుల్లో

మస్తుగ చిందులు వేద్దాం ఆడీపాడీ.. మనమాడీపాడీ..’’

అంటూ సాగే వీడియో సాంగ్‌ను మీరు ఇదివరకటి మా పాటల్లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మంగ్లీ, శిశిర నారాయణ ఆలపించిన ఈ పాటకు దాము రెడ్డి దర్శకత్వం వహించారు. దీపాల పండగకు కళాకాంతిని జోడించారు. సుభాష్ నారాయణ్ ఎంజపురి రాసిన ఈ గీతానికి బాజీ సంగీతం సమకూర్చగా, వీడియోను అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు.

Telugu news Mictv coming with Diwali festival special song within hours hopes you will enjoy and encourage us as usual