కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా వున్న అనురాగ్ శర్మ ఎనలేని సేవలు చేశారు. తన ముప్ఫై ఏళ్ళ సర్వీసుకు సలాం చేస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆయనతో కత్తి కార్తీక జరపిన మాటా ముచ్చట ఇది.
చిన్నప్పుడే పోలీసు అవుతానని అనుకున్నరా ? అని కార్తీక అడ్డగా.. ‘ఒక తండ్రెప్పుడూ తన కొడుకును పోలీసోణ్ని చెయ్యాలనుకోడు. నేను ఎమ్మెస్సీ చదివి పోలీసోణ్ణి అయ్యాను. ఉద్యోగం వచ్చేవరకు కూడా తను లాస్ట్ బెంచీ కుర్రాణ్ణి. పోలీస్ ట్రైనింగ్‌లో కూడా నేను లాస్ట్ బెంచోణ్ణే’ అని అన్నారు సరదాగా.
మూడున్నరేళ్ళ పదవీ కాంలంలో తనకు తెలంగాణ రాష్ట్రం మంచి సహకారం అందించారన్నారు. ‘లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం కేసీఆర్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పోలీస్ డిపార్ట్ మెంటుకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చారు. నాకు కోపమొచ్చినప్పుడు వేరే రూములోకి వెళ్ళిపోతాను. అయితే యూత్‌కు కోపం అంత మంచిది కాదు..’ అని చెప్పారు. ‘చాలా ఫంక్షన్లకు నన్ను రమ్మని చెప్పినా నేను వెళ్ళలేకపోయాను. నా టైం నా చేతిలో వుండదు. ఎప్పుడు ఏ ఫోన్ ఎక్కడినుండి వస్తుందో కాబట్టి మా టైం మా చేతిలో వుండదు.. చాలా ఫంక్షన్లను వదులుకున్నాను’ అని అన్నారు.
ఇంతకు ముందు పోలీసులకు ఇప్పటి పోలీసు వ్యవస్థకు గల తేడాను ఆయన చాలా చక్కగా విశ్లేషించారు. ‘పబ్లిక్ పోలీసుల దగ్గరికి రావాలంటే భయపడకూడదు. వాళ్లు ఫ్రెండ్లీగా వచ్చి తమ సమస్యను చెప్పాలి. ఆ కాన్సెప్ట్ నుండే పుట్టుకొచ్చింది ఫ్రెండ్లీ పోలీస్. ధమ్కీ కాల్స్‌ను చాలా లైట్ తీసుకుంటాను..’ అని అన్నారు. ఇలా.., చాలా విషయాలను మైక్ టీవీతో ముచ్చటగా పంచుకున్నారు మాజీ డీజీపీ అనురాగ్ శర్మ. ఈ ముచ్చటను చూస్తే మీరూ ఫిదా అవుతారు.