mictv telugu

మైక్ టీవీ సంక్రాంతి పాట వచ్చేస్తోంది..  

January 10, 2019

పండగ పండగకు అందమైన, వీనుల విందైన పాటలతో సందడి చేసే మీ అభిమాన మైక్ టీవీ ఈ సంక్రాంతి పండగకు కూడా ఓ దృశ్య కావ్యాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది. ముగ్గుళ్లు, గొబ్బెమ్మలు, పట్టు పరికిణిలు, కోళ్ల పందేల కోలాహలంతో సాగే ఈ పర్వదినం ఈ పాటతో మరింత వైభవంగా సాగాలని కోరుకుంటున్నాం..

‘‘రంగుల పుట్టిల్లూ, తెలుగూ లోగిళ్లూ, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ

కురిసె మంచు జల్లూ, తెరిచె పూల కళ్లూ, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ

పట్టు పరికిణి కట్టి, సుకకల వరసలు పెట్టి, చక్కని ముగ్గులు పెట్టి..’’

అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌ను మంగ్లీ, హన్మంతు ఆలపించారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణసారథ్యంలో దాము కొసనం దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని అందించగా, మిట్టపల్లి సురేందర్ గీతాన్ని రచించారు. మా పాటలను ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న వీక్షకులు ఈ పాటను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం..Telugu news Mictv sankranti song 2019 promo released wishing happy festival sung by Mangli and directed by damu kosanam