మోహన్ భాగవత్.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిసా? - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్ భాగవత్.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిసా?

December 4, 2017

ఆరెఎస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భాగవత్ ఎవరని ప్రశ్నించారు.  అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన అంశం సుప్రింకోర్టులో ఉందన్నారు. భగవత్ ఏ అధికారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని, ఆయన ఏమైనా భారత ప్రధాన న్యాయమూర్తా అని ప్రశ్నించారు.రామమందిరం తప్పక నిర్మించి తీరుతామని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పలు ఉండవని భాగవత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరల్లోనే అయోధ్యలో రామమందిరం నిర్మించబోతున్నామని, భక్తులంతా వచ్చే దీపావళి రామ మందిరంలో జరుపుకుంటారని బీజేపీ సినియర్ నేత సుబ్రమణ్యియన్ స్వామి కూడా ఆదివారం ప్రకటించారు. అయోధ్య రామ మందిరం -బాబ్రీ మసీదు వివాదంపై 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రింకోర్టులో మంగళవారం తుది విచారణ జరగనుంది.