అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు వద్దు.. ఒవైసీ

ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలకలరం రేపారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆర్థిక కారణాలతో రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని ఆయన అన్నారు.

‘దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకే రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకురావొచ్చు.. అయితే రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి ఉద్దేశించినవి. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వకూడదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Telugu news MiM MP asaduddin owaisi oppose Modi reservation to upper caste says purpose of quota only for dalits