దేశం కోసం ముస్లింలు మరణించారు.. ఒవైసీ వ్యాఖ్యలు... - MicTv.in - Telugu News
mictv telugu

దేశం కోసం ముస్లింలు మరణించారు.. ఒవైసీ వ్యాఖ్యలు…

February 13, 2018

ఎంఐఎం పార్టీ నేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సంజువాన్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవానులకు సైతం మత రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఏడుగురు ముస్లింలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ విధంగా ఒవైసీ మాట్లాడారు.. ‘ముస్లింల జాతీయతను సోకాల్డ్  జాతీయవాదులు ఎప్పటికి ప్రశ్నిస్తున్నారు. సంజువాన్ ఉగ్రదాడిలో మరణించిన ఏడుగురిలో ఐదుగురు కశ్మీర్ ముస్లింలు ఉన్నారు. దేశం పట్ల మాకున్న చిత్తశుద్ది ,ప్రేమను ప్రశ్నించే వారందరికీ ఓ కనువిప్పు కావాలి. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నా కూడా పాకిస్థానీయులు అంటున్నారు. దేశం పట్ల తమను విదేయతను చూపించుకోవాలని ఇప్పటికీ కూడా ముస్లింలను అడుగుతున్నారని’ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.ఉగ్రవాద దాడులను అరికట్టడంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.