పెంపుడు జంతువులకు దొడ్డిపెట్టె - MicTv.in - Telugu News
mictv telugu

పెంపుడు జంతువులకు దొడ్డిపెట్టె

November 30, 2017

పెంపుడు జంతువు అంటే ఇంట్లో ఎవరికైనా ప్రీతే. కానీ దాని మలమూత్రాలను క్లీన్ చేయటానికి అందరికీ  ప్రీతి అంతలా వుండదు. ఇంట్లో ఏ ఒక్కరో వాటి మలాన్ని ఎత్తడానికి పూనుకుంటారు. అయితే ఇకముందు అలాంటి ఇబ్బంది లేకుండా వాటి కోసం ఒక చిన్న సైజు పరికరం త్వరలోనే మార్కెట్లోకి రానున్నది.  బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీ ఈ డివైజ్‌ను రూపొందించింది. ఈ డివైజ్ పేరు ‘ఆటోమేటిక్ లిటర్ బాక్స్ ’. పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువుల మలమూత్రాలను ఫ్లాష్ చేస్తుంది. ఈ పరికరంపై పెంపుడు జంతువును కూర్చోబెట్టాలి. అంతే డివైజ్‌లోని సెన్సర్లు ఆ జంతువుల మలమూత్రాలను ఫ్లాష్ చేస్తాయి.దీనికోసం జంతువులకు శిక్షణ ఇవ్వాల్సి వుంటుంది. త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న ఈ పరికరం  ధర రూ. 10,000 వరకూ ఉండవచ్చని సంస్థ తెలిపింది. ఇది జంతువులకు మినీ టాయిలెట్ లాంటిదంటున్నారు జంతు ప్రేమికులు.