ఐదుగురు సన్యాసులకు మంత్రి హోదా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐదుగురు సన్యాసులకు మంత్రి హోదా..

April 4, 2018

నర్మదా నది పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఐదుగురు హిందూ సన్యాసులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మంత్రి హోదా కల్పించింది. మార్చి 31న నర్మదానంద మహారాజ్,  కంప్యూటర్ బాబా, హరిహరానంద్ మహారాజ్, భయ్యూ మహారాజ్, పండిట్ యోగేంద్ర మహంత్‌లతో నర్మదా నది పరిరక్షణ మీద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు దిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక వారి రాజకీయ జిమ్మిక్కు వుందని విమర్శించింది. తన పాపాలను కడుక్కోవటానికే సీఎం ప్రయత్నిస్తున్నారని హస్తం ఆరోపించింది.‘ మత పరమైన సెంటిమెంట్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోంది. నర్మదా నది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల మొక్కలను ఎక్కడ నాటిందో ఈ సాధువులు చూసి చెప్పాలి ’ అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది .