హరీశ్ రావుకు పిల్లోళ్ల విరాళం రూ. 516 - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్ రావుకు పిల్లోళ్ల విరాళం రూ. 516

October 2, 2018

కిడ్డీబ్యాంక్ మనీ మా  హరీశ్ రావు అంకుల్‌కే అంటూ చిన్నారులు రూ.516 మంత్రికి ఇచ్చారు. ఇది సిద్దిపేట పట్టణంలో నడుస్తున్న మరో నయా  ట్రెండ్.  పెద్దల నుంచి చిన్నారులు సైతం మంత్రి హరీష్ రావుకి ముగ్దులవుతున్నారు అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మంత్రి హరీష్ రావు పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంలో కళ్ళకుంట కాలనీకి చెందిన చిన్నారులు కొన్ని రోజుల పాటు.. తల్లితండ్రులు , బంధువులు ఇచ్చిన డబ్బు ను కిడ్డీబ్యాంక్‌లో దాచుకున్నారు.   డబ్బును దేవునికో మొక్కి ఇస్తారు. లేదా ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తారు.

Harish Rao, who has stolen children's minds

కానీ సిద్దిపేటలో నయా ట్రెండ్ మొదలైనట్టే వుంది. ‘మంత్రి హరీష్ రావు గారికి అభిమానంతో ఎన్నికల ఖర్చుకు అందరూ విరాళాలు ఇస్తున్నారని..మేము కూడా అన్నకు మా వంతు సహాయంగ  మేము  దాచుకున్న డబ్బును హరీషన్నకు ఇస్తున్నాం’ అని తమ చిన్ని మనసులోని పెద్ద ఔదార్యాన్ని చాటుకున్నారు. మంత్రి మనసును దోచుకున్నారు. పసి పిల్లల నుండి పండు ముసలి వరకు మంత్రి హరీష్ రావుపై ఎనలేని అభిమానం ఉందనటానికి ఇదే నిదర్శనం.