మోదీ కేబినెట్ మంత్రికి కోట్ల లంచం. సీబీఐ అధికారి - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ కేబినెట్ మంత్రికి కోట్ల లంచం. సీబీఐ అధికారి

November 19, 2018

మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బొగ్గు శాఖను నిర్వహించిన నాటి మంత్రులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజాగా నరేంద్ర మోదీ కేబినెట్లో బొగ్గు శాఖ నిర్వహిస్తున్న గుజరాత్‌కు చెందిన హరిభాయ్ పార్తీభాయ్ చౌదరికి కూడా అవినీతి మరకలు అంటుకున్నాయి.

మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసు దర్యాప్తు వ్యవహారంలో హరిభాయ్ కొన్ని కోట్ల లంచం తీసుకున్నారని సీబీఐ డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా సుప్రీం కోర్టుకు తెలిపారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బదిలీపై పంపేముందు రోజు కేంద్రం మనీశ్‌ను కూడా బదిలీ చేసింది. తన బదిలీ ఏకపక్షమని, తనకు అన్యాయం జరిగిందని ఆయన కోర్టుకెక్కారు. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులపై కొందరు నేతలు కక్ష సాధిస్తున్నారని తన పిటిషన్లో ఆరోపించారు.

Minister in Modi Government Was Also Bribed, CBI Officer Alleges in SC Petition Union minister of state for coal and mines Haribhai Parthibhai Chaudhary received.

మొయిన్ కేసులో దర్యాప్తులో డబ్బులు చేతులు మారాయని, లంచాల దందా సాగిందని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ మొదటి పక్షంలో బొగ్గు మంత్రికి గుజరాత్‌కు చెందిన విపుల్ అనే వ్యక్తి ద్వారా కోట్లు లంచం అందిందని ఆరోపించారు. ఆ కేసులో దొరికిన మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్ అనే దళారులకు జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ దోవల్’కు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు.  అలోక్ వర్మ, మరో సీబీఐ అధికారి రాకేశ్ ఆస్తానాలు ఎదుర్కొంటున్న అవినీతి కేసుల్లో దోవల్ జోక్యం చేసుకున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో దీనికి ఆధారాలు లభించాయని వివరించారు.

Telugu news  Minister in Modi Government Was Also Bribed, CBI Officer Alleges in SC Petition Union minister of state for coal and mines Haribhai Parthibhai Chaudhary received “a few crores of rupees” in the “first fortnight of June 2018” as part of the extortion racket being run by certain officers investigating the Moin Qureshi case.