100 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

100 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కేటీఆర్

December 7, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సగటున 60 సీట్లు సాధిస్తుందని వస్తున్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. మహాకూటమి గెలుస్తుందన్న లగడపాటి రాజగోపాల్ సర్వేనూ కొట్టిపడేశారు. తమ పార్టీ 100 సీట్లు గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ట్వీట్ చేశారు.

మూడు నెలలుగా పార్టీ కోసం లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పనిచేశారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అన్ని జిల్లాల తాను వివరాలను తెప్పించుకుంటున్నానని, టీఆర్ఎస్ పార్టీ దాదాపు 100 సీట్ల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు.

Telugu news, minister KTR, TRS winning, 100 seats, Telangana elections and rules out exit polls