పార్కులో సైకిలెక్కిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పార్కులో సైకిలెక్కిన కేటీఆర్

November 20, 2017

గచ్చిబౌలిలోని కొత్తగూడ రిజర్వ్‌లో నగరవాసుల కోసం పాలపిట్ట సైక్లింగ్ పార్కు రెడీ అయింది.  దీన్ని సోమవారం మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. కాసేపు సైకిల్ తొక్కారు. పచ్చని చెట్లు నడుమ, చెరువు గట్టు మీద ఆహ్లాదకరమైన వాతావరణంలో సైకిల్ తొక్కేందుకు 3 కిలో మీటర్ల ట్రాక్‌ను తీర్చిదిద్దారు .రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ.. పాలపిట్ట పార్కును  దాదాపుగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దింది. ముళ్లకంపలు, పిచ్చి మెక్కలు ఉన్న ప్రాంతాన్ని సుందరంగా మార్చారు. హారితహారంలో భాగంగా దాదాపుగా 7వేల మెుక్కలను నాటడంతో ప్రాంతం అందంగా, ఆహ్లాదకరంగా మారింది.ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పార్క్‌లో సైకిల్‌ తొక్కొచ్చు.

సైకిలింగ్ కోసం 230 సైకిళ్లు రెడీగా  ఉన్నాయి.  సైకిల్ తొకేందుకు గంటకు పిల్లలకు రూ. 25, పెద్దలకు రూ. 30 చెల్లించాలి. సొంత సైకిల్ తెచ్చుకుంటే గంటకు రూ. 25 రుసుము చెల్లించాలి. నెలవారీ వాసుల కోసం రూ. 800 చెల్లించాలి. పార్క్ కు వచ్చేవారి కోసం మూత్రశాలలతోపాటుగా , విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక భవనాన్ని కూడా నిర్మించారు.