న్యూటన్ సిద్ధాంతం మన మంత్రాల్లోనే ! - MicTv.in - Telugu News
mictv telugu

న్యూటన్ సిద్ధాంతం మన మంత్రాల్లోనే !

March 1, 2018

ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన డార్విన్ జీవపరిణామ సిద్దాంతం తప్పని  కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే  ఇప్పుడు ఆయన మరో విషయాన్ని లేవనెత్తారు.

న్యూటన్  కనిపెట్టిన గమన నియమాలు…ఆయన కనిపెట్టకముందే మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని  సత్యపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు  సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని, అప్పుడు విద్యార్థులు మరింత నేర్చుకోవడానికి  అవకాశం ఉంటుందని సత్యపాల్‌ సూచించారు.

విద్యార్థులకు చదువు మంచిగా రావాలంటే భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలని ఆయన అన్నారు.  డార్విన్‌ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని  దీనిపై ఎవరూ రచ్చ  చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.