ఆమంత్రితో సెల్ఫీ ప్రమాదమే - MicTv.in - Telugu News
mictv telugu

ఆమంత్రితో సెల్ఫీ ప్రమాదమే

November 20, 2017

కర్నాటకలో ఓ విద్యార్థి మంత్రితో సెల్ఫీ తీసుకోబోయాడు, కానీ ఇంతలోనే పాపం మంత్రిగారి కోపానికి గురయ్యాడు. కర్నాటక ఇంధన శాఖ మంత్రి డి.కె శివకుమార్ కర్నాటకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు.

ఫంక్షన్ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతున్నాడు. రాక రాక మంత్రి కాలేజీకి వచ్చాడనే ఉత్సాహంతో, ఓ కుర్రాడు మంత్రితో సెల్ఫీ దిగాలని ఆరాటపడ్డాడు. వెంటనే మంత్రి వెనక్కి వెళ్లి  ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక్కసారిగా మంత్రి శివకుమార్ ఆ విద్యార్థి చేతిని పక్కకు నెట్టాడు. దీనితో విద్యార్థికి మంత్రితో సెల్ఫీ దిగాలనే ఆశ అడియాసే అయ్యింది.

https://twitter.com/ANI/status/932587539323543552