ఈమె మేనత్త కాదు.. రాక్షసి అత్త - MicTv.in - Telugu News
mictv telugu

ఈమె మేనత్త కాదు.. రాక్షసి అత్త

December 10, 2017

స్వంత మేనత్తే  ఆ పిల్ల పాలిట రాక్షసిలా మారింది.  పెంచుకుంటూ  కంటికి రెప్పలా కాపాడాతానని చెప్పి , పసి పాపని పెళ్లి పీటలెక్కిచ్చింది. గుంటూరు జిల్లా పిడుగు రాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతిల  కూతురిని  వెంకయ్య చెల్లె నాగలక్ష్మి  ఆమెకు సంతానం లేని కారణంగా  13 ఏళ్ల  వెంకయ్య కూతురిని పెంచుకుంటానని తీసుకెళ్లింది.

ఆ తర్వాత 35 ఏళ్ల మనోజ్ అనే వ్యక్తితో  ఐదో తరగతి చదువుతున్న ఆ పాపకు  బలవంతంగా పెళ్లి చేసింది. అంతేకాదు ఆ పసిపాపకు నిద్రమాత్రలు ఇచ్చి మరీ శోభనం గదిలోకి పంపింది.  పాపం ఆతర్వాత చాలా రోజులు ఆ పాపను మేనత్త, మరియు భర్త కలిసి చిత్ర హింసలు పెట్టారు.  తమ కూతురు ఎలా ఉందో చూసిపోదామని వచ్చిన  పాప తల్లి పార్వతికి ఈ విషయం తెలిసి షాక్ కు గురైంది.  తన బిడ్డ ఒంటిపై  గాయాలు చూసి కన్నీరు మున్నీరయ్యింది.  తమ బిడ్డను చిత్రహింసలు పెట్టిన మేనత్తకు కఠినంగా శిక్షించాలని  వారు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.