ఏడాది పాపపైనుంచి వెళ్లిన రైలు.. అయినా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది పాపపైనుంచి వెళ్లిన రైలు.. అయినా..

November 20, 2018

మనుషుల వెర్రి తొందర ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. రైల్లో తొక్కిసలాట ఫలితంగా ఏడాది వయసున్న బోసినవ్వులు పాప తల్లి ఒడిలోంచి జారి రైలు పట్టాలపై పడిపోయింది. రైలు దూసుకెళ్లిపోయింది. గుండెదడతో, కడుపుతీపితో కళ్లప్పగించి చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోయిన తల్లిదండ్రులు తర్వాత గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. బుజ్జాయి చిన్న గాయం కూడా కాకుండా మృత్యువును ఎదిరించింది మరి.

మధ్యప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ రోజు మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. సోనూ అనే వ్యక్తి తన భార్య, కూతురితో కలసి రైలు దిగుతున్నాడు. త్వరగా దిగాలన్న తొందరలో ప్రయాణికులు వారిని ముందుకు నెట్టారు. దీంతో సోనూ భార్య చంకలోని బిడ్డ రైలు పట్టాలపై పడిపోయింది. రైలు పట్టాలకు, ప్లాట్ ఫారమ్ కు మధ్య ఖాళీ ప్రదేశంలో పడిపోవడంతో సురక్షితంగా బయటపడింది. పాప ఏమాత్రం కదలకుండా, ప్రమాదం జరుతుందేమో తెలుసన్నట్లు చక్కగా అలాగే ఉండిపోయింది. అసలు ఏడవనేలేదు. రైలు వెళ్లిపోయాక చిన్నారని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నారు తల్లిదండ్రులు. ఈ దృశ్యాలు స్టేషన్లోని సీసీకెమరాల్లో రికార్డయ్యాయి.

 Telugu news Miraculous escape, One-year-old baby survives after a train runs over her at Mathura station in Uttar Pradesh