మిస్ యూనివర్స్‌గా దక్షిణాఫ్రికా భామ - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ యూనివర్స్‌గా దక్షిణాఫ్రికా భామ

November 27, 2017

విశ్వసుందరిగా దక్షిణాప్రికాకు చెందిన డెమీ లేహ్ నెల్ పీటర్స్ కిరీటం  దక్కించుకుంది. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఆదివారం జరిగిన  తుది పోరులో డెమీ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. మెుత్తం 92 మంది అమ్మాయిలు ఈ పోటీలో  పాల్గొనగా, వారిందర్ని వెనుకకు నెట్టి డెమీ ప్రథమ స్థానంలో నిలిచింది.  

22 ఏళ్ల డెమీ బిజినెస్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. దాదాపుగా నాలుగు దశాబ్ధాల తరువాత  దక్షిణాప్రికా అమ్మాయి విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1978లో దక్షిణాప్రికా చివరిగా విశ్వసుందరి గౌరవాన్ని అందుకుంది. కాగా, తాజా పోటీలో కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్ తొలి రన్నరప్‌గా నిలవగా, జమైకాకు చెందిన డెవీనా బెన్నెత్  రెండో రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కు చెందిన శ్రద్ధా శశిధర్ ఈ పోటీలో 10వ స్థానంలో నిలిచింది.