శశిథరూర్‌కు మిస్ వరల్డ్ ఘాటు కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

శశిథరూర్‌కు మిస్ వరల్డ్ ఘాటు కౌంటర్

November 20, 2017

భారతీయ చిల్లరకు అవార్డు దక్కిందంటూ తనను ఎగతాళి చేసిన కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు  మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ షాకిచ్చింది. ఆయన ట్వీట్‌ను తేలిగ్గా తీసుకుంటూనే సిగ్గుతో తలదించుకునేలా ఘాటు ట్వీట్ చేసింది.

 

ప్రపంచాన్ని గెలిచిన ఓ యువతి  ఇలాంటి వ్యాఖ్యలకు ఏమీ అసంతృప్తి చెందదు. చిల్లర మాటలు ఓ చిన్న మార్పు మాత్రమే..  చిల్లా‌ర్‌లో ‘చిల్ ‘ఉందని మరచిపోవద్దు’ అని ఆమె ట్వీట్ చేసింది. మరోపక్క… శశిథరూర్‌ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. దాంతో శశిథరూర్ మానుషికి క్షమాపణ  చెప్పారు. తనకు ఆమెను కించపరిచే ఉద్దేశం లేదని ట్వీట్ చేశాడు.